HomeTelugu Trending'పంచతంత్రం': బ్రహ్మానందం టీజర్‌ విడుదల

‘పంచతంత్రం’: బ్రహ్మానందం టీజర్‌ విడుదల

Brahmanandam teaser from Pa

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. నేడు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు.

‘జర్నీ ఆఫ్ వ్యాస్’ పేరుతో విడుదల చేసిన టీజ‌ర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు. ‘ఏమ్మా’ కెరీర్ అంటే ఇరవైల్లోనే మొదలు పెట్టాలా? అరవైల్లో మొదలు పెట్టకూడదా?’ అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ ‘బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో మనల్ని నవ్వించారు. ఆయనలో వినోదం మాటున అద్భుతమైన నటుడు ఉన్నారు. మా సినిమాలో నటుడిగా ఆయన కొత్త పాత్రలో కనిపిస్తారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు, మా సినిమాలో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ, ఇతర వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు.

హాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu