HomeTelugu News'మను' మూవీ ట్రైలర్‌

‘మను’ మూవీ ట్రైలర్‌

పల్లకిలో పెళ్లికూతురు, బసంతి వంటి చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నాడు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న మిస్టరీ రొమాన్స్‌ డ్రామా ‘మను’. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చాందినీ చౌదరి, జాన్‌ కోట్లీ, అభిరామ్‌, మోహన్‌ భగత్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

9 10

 

‘తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగను వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది’ అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ‘వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. వస్తువులు మాత్రం పిచ్చి పిచ్చిగా మారిపోతున్నాయి. దొంగైతే డబ్బులు ఎత్తుకుపోతాడు. కానీ, అలాగే ఉన్నాయి. దెయ్యం అయితే కొట్టి వెళ్లిపోమని భయపెడుతుంది. కానీ, నేను తాగిన గ్లాసులు, పారేసిన సిగరెట్లు అట్టిపెట్టదు’ ‘ఎక్కువ చక్కెర నాలుకపై తియ్యగానే ఉంటుంది. కానీ, అది రక్తంలోకి కలిశాక గందరగోళం చేస్తుంది.’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. నరేష్‌ కుమారన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్వాణ సినిమాస్‌ సమర్పిస్తుండగా, ది క్రౌడ్‌ పేరుతో సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu