HomeTelugu Trendingసుమ కొడుకు రోషన్‌ సినిమా 'బబుల్ గమ్' టీజర్‌

సుమ కొడుకు రోషన్‌ సినిమా ‘బబుల్ గమ్’ టీజర్‌

Bubblegum Teaser

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్వరీ మూవీస్ – పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘క్షణం’ సినిమాతో పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ‘బబుల్ గమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రాజమౌళి రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రోషన్ లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

హీరో- హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలను కవర్ చేశారు. ఈ సినిమాలో రోషన్ జంటగా ‘మానస’ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu