HomeTelugu Trendingసుమ కొడుకు హీరోగా ఫస్ట్‌లుక్‌

సుమ కొడుకు హీరోగా ఫస్ట్‌లుక్‌

suma son roshan kanakala fi

యాంకర్ సుమ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అభిమానులుగా మార్చుకుంది. రాజీవ్ కనకాల కూడా టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా వీరి కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

రోషన్ కనకాల హీరోగా మహేశ్వరి మూవీస్ పతాకంపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల.. చిత్రాలతో విజయాల్ని అందుకున్న రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. పి. విమల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా… రోషన్ కనకాల పుట్టిన రోజును సందర్భంగా బుధవారం సినిమాను ప్రకటించారు.

దీంతో పాటు రోషన్ ఫస్ట్‌లుక్ ను కూడా విడుదల చేశారు. అందులో రోషన్ డీజే లుక్ లో కనిపిస్తున్నాడు. చెవిలో హెడ్ సెట్ బ్లాక్ గ్లాసెస్ యాష్ కలర్ హుడూ విత్ వాచ్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కొత్తతరం రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది. అయితే ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu