HomeTelugu Trending'బబుల్‌గమ్‌' కి 'A' సర్టిఫికెట్‌

‘బబుల్‌గమ్‌’ కి ‘A’ సర్టిఫికెట్‌

bubblegum movie get a certi
యాంక‌ర్ సుమ కొడుకు రోషన్‌ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. రవికాంత్‌ పేరెపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ వేగం చేశారు మేక‌ర్స్. ఇప్ప‌టికే సినిమా విడుదలైన అప్డేట్స్‌ యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. ‘బబుల్‌గమ్‌’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు సెన్సార్ బోర్డు వెల్ల‌డించింది.

మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న ఓ యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాడు అనే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu