HomeTelugu Trending'ఉప్పెన-2'పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఉప్పెన-2’పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Director buchi babu comment

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన‌’. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిందవి. త‌న తొలి సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. దర్శకుడు సుకుమార్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేసిన బుచ్చిబాబు.. సాహసోపేత‌మైన క‌థ‌తో హిట్ కొట్టి చూపించాడు.

ఇప్పుడు ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబు ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఉప్పెన 2 గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపాడు బుచ్చిబాబు.

Director buchi babu 1

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు‌.. ఉప్పెన కంటే కూడా ఉప్పెన 2 క‌థ‌నే ముందుగా రాసుకున్న‌ట్లు చెప్పాడు. ఉప్పెన 2 ప్ర‌పంచంలోనే ఎవ‌రూ రాయ‌ని ఒక స్టోరీ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు. దీంతో ఉప్పెన‌తోనే వినూత్న ప్ర‌యోగం చేసిన బుచ్చిబాబు.. ఉప్పెన 2లో ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడో అని ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu