HomeTelugu Trendingవదినకు నువ్వు ఛాన్స్‌ ఇవ్వు.. కేటీఆర్‌, కవితల ఆసక్తికర ట్వీట్లు..

వదినకు నువ్వు ఛాన్స్‌ ఇవ్వు.. కేటీఆర్‌, కవితల ఆసక్తికర ట్వీట్లు..

4 17
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి పరిష్కారం చూపిస్తారు. లాక్‌డౌన్ తో ఆయనకు ప్రజలనుండి ఎక్కువ సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. అయితే ప్రజలు అత్యవసర సమస్యలే కాకుండా హాస్యాస్పదంగా ఉన్న సమస్యలను కూడా చెప్పటంతో కేటీఆర్ దిమ్మతిరిగిపోయే కౌంటర్‌లు ఇస్తారు. తాజాగా ఓ యువకుడు “కేటీఆర్ సర్.. మిమ్మల్ని సిన్సియర్ గా ఓ మాట అడుగుతున్నాను. ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులు, సెలూన్లు తెరిచే ఆలోచన ఏదైనా ఉందా? ఎందుకంటే నాకు క్రాఫ్ చేయాలని నా భార్య ఎంతో తహతహలాడిపోతోంది. అదే గనుక జరిగితే మీరు లాక్‌డౌన్ ఎత్తేసినా నేను ఇంటికే పరిమితమైపోతానని గట్టి నమ్మకం” అంటూ ట్వీట్ చేసాడు. దానికి కేటీఆర్ విరాట్ కోహ్లీ అంతటివాడే తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నాడు. నువ్వెందుకు చేయించుకోవు? అని నెటిజెన్‌కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు. అయితే ఈ సీన్‌లో కేటీఆర్ సోదరి కవిత ఎంటర్‌ అయ్యారు. “అన్నయ్యా.. బీబీ(వదిన)కు నువ్వు కూడా ఛాన్స్ ఇస్తున్నావా” అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu