పవన్ బీజేపీని గెలిపించే దమ్ముందా?

ఇవాళ విజయవాడలో ఏపీ ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న మాట్లాడుతూ మహాకూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో.. ఈనెల‌11వ తేదీ తర్వాత తెలంగాణలో కేసీఆర్ మూట, ముల్లె సర్దుకోవడం ఖాయమనీ అన్నారు. కేసీఆర్ బ్యాచ్ కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రచారంతో నేతల్లోనే కాకుండా ప్రజల్లోనూ భరోసాను పెంచిందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా వారి కోసం నేను ఉన్నానంటూ చంద్రబాబు ముందుకొస్తారని చెప్పారు. జగన్, పవన్‌లు కేసీఆర్‌, మోడీలతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన బుద్దా.. దేశంలోరాజకీయాల నుంచి కలుపు మొక్కలను ఏరిపారేయాలని చంద్రబాబు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారని చెప్పారు. బాబు దెబ్బకు మోడీ, కేసీఆర్‌, జగన్, పవన్‌లు రాజకీయాల నుంచి పారిపోవడం ఖాయమన్నారు. టీడీపీని తానే అధికారంలోకి తెచ్చానంటున్న పవన్‌.. 2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతుగా ప్రచారం చేసి గెలిపించే దమ్ముందా అని ప్రశ్నించారు.