బన్నీ సినిమాకు సుదీప్ ఫోటోగ్రఫీ!

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయడం సాధారణంగా
మారిపోయింది. అక్కడ పాపులారిటీ సాధించిన టెక్నీషియన్స్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి
మరి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా కెమెరామెన్ విషయంలో ఇది
ఎక్కువగా జరుగుతోంది. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ డిఓపి సుధీప్ ఛటర్జీ తెలుగులో ఎంట్రీ
ఇవ్వబోతున్నారు. చక్ దే ఇండియా, గుజారీష్ వంటి చిత్రాలను పని చేసిన సుదీప్ ఇప్పుడు
హృతిక్ రోషన్ నటిస్తోన్న కాబిల్ చిత్రానికి పని చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన ఓ తెలుగు
సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో
రాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో డిఓపీ గా సుదీప్ ను ఒప్పించారు. ఈ సినిమాకు
ఇదొక స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్
సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates