బన్నీ సరసన కీర్తి సురేష్..?

అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. బన్నీ
కూడా ఈ సినిమాపై చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు
వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే
మాటల్లో కీర్తి సురేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘నేను.. శైలజ’ సినిమాతో యూత్ లో క్రేజ్
తెచ్చుకున్న ఈ భామ తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. కీర్తిను హీరోయిన్ గా తీసుకుంటే
మార్కెట్ వైజ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ఆమెనే ఫైనల్ చేయాలనుకుంటున్నారు.
కీర్తి గనుక ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మెగాకాంపౌండ్ లో మిగిలిన హీరోలతో నటించడానికి
ఆమెకు ఎక్కువ సమయం పట్టదు. ఇది కాకుండా.. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త
వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెబుతున్నారు. అందులో
ఒకటి నెగెటివ్ షేడ్స్ లో ఉన్న పాత్ర కావడం విశేషం. ఇదే గనుక నిజమైతే అల్లు అర్జున్ కెరీర్
కు ఇదొక మైలురాయి కావడం ఖాయం.
CLICK HERE!! For the aha Latest Updates