బన్నీతో మరోసారి కాజల్..?

kajal

అల్లు అర్జున్, కాజల్ జంటగా ‘ఆర్య2′,’ఎవడు’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం బన్నీ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే దిల్ రాజు, హరీష్ శంకర్ లు కలిసి ‘ఖైదీనెంబర్ 150’ సినిమా సెట్ కు వెళ్ళి.. చిరంజీవి, వినాయక్, కాజల్ తో కలిసి మాట్లాడారు. ఈ వార్త ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ కు జోడీగా కాజల్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అక్కడకి వెళ్లారనే మాటలు వినిపిస్తున్నాయి. కాజల్
కూడా మంచి హిట్ సినిమాల కోసం ఎదురుచూస్తోంది. సో.. ఈ అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ప్రస్తుతం మామతో సినిమా చేస్తోన్న ఈ భామ త్వరలోనే అల్లుడితో జత కట్టబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates