HomeTelugu Newsసి.కళ్యాణ్ సమర్పణలో కల్పనాచిత్ర "విచారణ" (ది క్రైమ్)

సి.కళ్యాణ్ సమర్పణలో కల్పనాచిత్ర “విచారణ” (ది క్రైమ్)

సి.కళ్యాణ్  సమర్పణలో 
కల్పనాచిత్ర “విచారణ” (ది క్రైమ్)
“విశారణై” పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు.. “ఉత్తమ ప్రాంతీయ చిత్రం”గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం..  “విచారణ” పేరుతో తెలుగులో విడుదల కానుంది. “ది క్రైమ్” అన్నది ట్యాగ్ లైన్.  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో..  కల్పనాచిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు “ఆదుకాలం” అనే చిత్రం రూపొందించి, ఆ చిత్రానికి కూడా జాతీయ అవార్డు అందుకున్న”తమిళ సంచలనం”  వెట్రిమారన్ దర్శకత్వం వహించిన “విచారణ” చిత్రం తమిళ్ వెర్షన్ కు ప్రముఖ హీరో ధనుష్ నిర్మాత కావడం విశేషం. ఓ ఆటో డ్రైవర్ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం..  రజినీ, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ ప్రశంసలు దండిగా పొందింది. “ఇటీవలకాలంలో ఇంత గొప్ప చిత్రాన్ని తాము చూడలేదని” పలువురు ప్రఖ్యాత దర్శకులు సైతం ఈ చిత్రంపై అభినందనల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆనందిని అఛ్చ తెలుగు అమ్మాయి కావడం మరో ముఖ్య విశేషం. 
చిత్ర సమర్పకులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “విచారణ” (ది క్రైమ్) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా అవార్డులు పొందిన సినిమాలకు రివార్డులు (కలెక్షన్స్) అంతగా రావు. అలాగే, రివార్డ్స్ వఛ్చిన సినిమాలకు అవార్డ్స్ రావు. కానీ.. “విచారణ” (ది క్రైమ్) చిత్రం మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ చిత్రానికి “రివార్డులు, అవార్డులు” సమానంగా వచ్చాయి. తమిళంలో అసాధారణ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ చాలా పెద్ద విజయం సాధించడం ఖాయం. వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ “విచారణ” (ది క్రైమ్) చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు” అన్నారు.  
దినేష్, ఆనంది, కిషోర్, ఆదుకాలం మురుగదాస్, సముద్రఖని, అజయ్ ఘోష్  ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా:  ఎస్.రామలింగం, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సమర్పణ: సి.కళ్యాణ్, నిర్మాణం: కల్పనాచిత్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెట్రిమారన్ !!
Vicharana Stills (18)

Recent Articles English

Gallery

Recent Articles Telugu