HomeTelugu Trending'కిలాడీ'లో బన్నీ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌..

‘కిలాడీ’లో బన్నీ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌..

Catherine Special Song in
మాస్ రాజా రవితేజ వరుసగా సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు రవితేజ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను రమేష్ వర్మ రిజిస్ట్రర్ చేయించాడట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రమేష్ వర్మ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లను హీరోయిన్ లుగా ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే గా నటించిన కేథరిన్ ను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్ సినిమాల పై దృష్టిపెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu