HomeTelugu Trendingఆకట్టుకుంటున్న యంగ్ జయలలిత గా కంగన..లుక్‌

ఆకట్టుకుంటున్న యంగ్ జయలలిత గా కంగన..లుక్‌

3 23
తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పుడు అందరి దృష్టి కంగన రనౌత్ నటిస్తున్న’తలైవి’ పైనే ఉంది. 2019 నవంబర్‌లో విడుదలైన ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ పై భిన్న స్పందన వచ్చింది . ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఇక జయలలిత 72వ జయంతి సందర్భంగా తాజాగా యుక్త వయసులో జయలలిత లుక్ ను విడుదల చేసారు చిత్రబృందం. తెల్లని చీరలో జయలలిత రూపంలో పూర్తిగా ఇమిడిపోయిన కంగన లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ లుక్ ను కంగన సోదరి రంగోలి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎలాంటి కృత్రిమ అవయవాలు, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ లేకుండానే, కంగన అమ్మను మరపిస్తోందంటూ కంగన సోదరి రంగోలీ చాందెల్ ట్వీట్‌ చేశారు. నిబ్ధదత ఉంటే ఏదైనా సాధ్యమే అని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్‌ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu