హైకోర్టు విభజనకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం సాయంత్రం గెజిట్‌ను విడుదల చేసింది. గత వారమే ఈ గెజిట్‌ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అన్ని విషయాలపైనా అధ్యయనం చేసి సంబంధిత శాఖలతో సమాలోచనలు జరిపి ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.

ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు వీరే..
జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ వెంకట నారాయణ, జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ శేషాద్రి నాయుడు, జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌రావు, జస్టిస్‌ సునీల్‌ చౌదరి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ శ్యాం ప్రసాద్‌, జస్టిస్‌ ఉమాదేవి, జస్టిస్‌ బాలయోగి, జస్టిస్‌ తేలప్రోలు రజని, జస్టిస్‌ వెంటక సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ గంగారావు

తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తులు వీరే..
జస్టిస్‌ వెంకట సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ నవీన్‌ రావు, జస్టిస్‌ కోదండరామ్‌ చౌదరి, జస్టిస్‌ శివశంకర్‌ రావు, జస్టిస్‌ షమీన్‌ అక్తర్, జస్టిస్‌ కేశవరావు, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌.