చైతు టైటిల్ కన్ఫర్మ్ అయింది..!

నాగచైతన్య హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో ఉండే ఓ రొమాంటిక్
ఫీల్ గుడ్ సినిమా. సో.. ఈ సినిమాకు కూడా చైతు అదే టైటిల్ ను పెట్టాలని భావించాడు.
కానీ తాజాగా ఈ సినిమా టైటిల్ గా ‘ఒకసారి ఇటు చూడవే’ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.
నాగార్జునకు ఈ టైటిల్ బాగా నచ్చడంతో దీన్నే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతోంది. అలానే మరో హీరోయిన్ నటించే
అవకాశం కూడా ఉండడంతో ఆ పాత్రకు లావణ్య త్రిపాఠిను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

CLICK HERE!! For the aha Latest Updates