చైతుతో శ్రీనువైట్ల సినిమా..?

‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ బాట పట్టిన నాగచైతన్య లిస్ట్ లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.
వరుసగా ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ.. వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్
అయిన తరువాత చైతు, శ్రీనువైట్లతో సినిమా చేయనున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
వరుస పరాయజయాలను చవిచూస్తోన్న శ్రీనువైట్ల ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మిస్టర్’
చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా
హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో
సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. నాగచైతన్య కోసం కథను సిద్ధం చేసుకొని
చైతుకి, నాగార్జునకు ఆ కథను వినిపించాడట. ఇద్దరికీ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్
ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates