ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత సకల జనుల సామూహిక దీక్ష

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు పిలుపు నిచ్చిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ ఒద్ద గుమిగూడిన కార్మికులు ఒక్కసారిగా పోలీసు వలయాలను ఛేదించుకొని ట్యాంక్‌బండ్‌పైకి కార్మికులు దూసుకొచ్చారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇప్పటి వరకు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో 300 మంది కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరోవైపు ఎంబీభవన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌కు సీపీఎం శ్రేణులు ప్రదర్శనగా బయల్దేరారు. పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి, విమలక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా ర్యాలీగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారంతా ఇందిరాపార్కువైపు వెళ్లారు.