HomeTelugu Big Storiesరివ్యూ: యమన్

రివ్యూ: యమన్

నటీనటులు: విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్, సంగిలి మురుగన్, చార్లే, ప్రింజ్ నితిక్
తదితరులు
సినిమాటోగ్రఫీ: జీవ శంకర్
మ్యూజిక్: విజయ్ ఆంటోని
ఎడిటింగ్: వీర సెంథిల్ రాజ్
నిర్మాత: మిరియాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: జీవ శంకర్
నకిలీ, సలీం, బిచ్చగాడు, బేతాలుడు ఇలా ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపించే విజయ్ ఆంటోనీ నటించిన మరో చిత్రం ‘యమన్’. ఈ సినిమా శివరాత్రి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
దేవరకొండఅశోక్ చక్రవర్తి(విజయ్ దేవరకొండ) చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకొని తాతయ్య దగ్గర పెరుగుతూ ఉంటాడు. కొన్నాళ్ళకు తన తాతయ్యకు క్యాన్సర్ రావడంతో వైధ్యం చేయించాల్సి వస్తుంది. కానీ అంత డబ్బు అశోక్ దగ్గర ఉండదు. ఎలా అయినా.. డబ్బు సంపాదించి తాతయ్యకు ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఓ యాక్సిడెంట్ కేసును డబ్బు కోసం తన నెత్తిన వేసుకొని జైలుకి వెళ్తాడు. ఈ పరిణామం తన జీవితాన్నే మార్చేస్తుంది. అశోక్ తన తెలివి, జ్ఞానంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. తనకు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్(త్యాగరాజన్) అండ దొరుకుతుంది. అశోక్ ను అహల్య(మియా జార్జ్) అనే హీరోయిన్ ప్రేమిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అశోక్ కు అన్ని వేళల సహాయం చేసే కరుణాకర్ అశోక్ ను చంపాలనే నిర్ణయం తీసుకుంటాడు. దానికి కారణం ఏంటి..? కరుణాకర్ చంపాలనుకునే విషయంఅశోక్ కు తెలుస్తుందా..? అశోక్ అనుకున్నట్లుగా ఎమ్మెల్యే అయ్యాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
రాజకీయ నేపధ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా… వాటన్నింటికంటే ‘యమన్’ ప్రత్యేకం. ఏ రాష్ట్రానికైనా సరిపడే రాజకీయ కథను ఎన్నుకొని దాన్ని తెరపై ఆసక్తికర కథనంతో ప్రెజంట్ చేయడంలో దర్శకుడిగా జీవ శంకర్ సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి ఆడియన్స్ లో క్యూరియాసిటీ కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ అప్పటికే ఆడియన్ కథకు కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. విజయ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. తన గెటప్స్ లో రెండు వేరియేషన్స్ చూపించాడు. విజయ్ ఆంటోనీ తప్ప మరెవెరూ ఈ పాత్రకు సెట్ కారేమో అన్నట్లుగా నటించాడు. త్యాగరాజన్ తన పాత్రలో ఇమిడిపోయారు. మియా జార్జ్ చక్కగా నటించింది. ప్రింజ్ నితిక్, స్వామినాథన్, మరిముత్తు ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. విజయ్ హీరోగా నటించడంతో పాటు మంచి మ్యూజిక్ కూడా అందించాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ సింపుల్ గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కంటెంట్ ను నమ్ముకుంటూ ఆర్భాటాలకు పోకుండా తక్కువ బడ్జెట్ లో సినిమా చేసి అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది యమన్.

రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu