
Chandrababu Naidu Assembly Speech: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 135 సీట్లతో తెలుగుదేశం పార్టీ పవర్ లోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కౌంటర్ల వర్షం కురిపించారు చంద్రబాబు. గతంలో జగన్ తమపై చేసిన కామెంట్లు అన్నిటికీ చంద్రబాబు నాయుడు తమ విజయంతో గట్టిగా జవాబు ఇచ్చారు. “ఇక్కడికి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళని అవమానించాల్సిన అవసరం లేదు. అలా చేసిన వారికి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చేశారు. అది నేను చూశాను” అని జగన్ ఓటమి గురించి డైరెక్ట్ కామెంట్స్ చేసారు.
“అప్పట్లో 23 సీట్లు మాకు వచ్చాయి. బాధపడ్డాము కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాము. ఎన్నికల తర్వాత ఆరోజు 23వ తేదీన మీకు 23 సీట్లు వచ్చాయి అది దేవుడి స్క్రిప్ట్ అని అన్నారు. కానీ ఈసారి కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే 11 వస్తుంది. దాదాపు 1631 రోజులు అమరావతి రైతాంగం, ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ నంబర్లు అన్నీ కలుపుకున్నా 11 వస్తుంది. మరి ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ అని నేను అనొచ్చు కానీ అనను” అంటూ గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి మీద చేసిన కామెంట్లకి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
ఇక ఆ సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకపోవడం గురించి కూడా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. “వాళ్ళు ఇక్కడ ఉండకుండా పోవడం వాళ్ల పిరికితనం” అని తేల్చి చెప్పారు.
Chandrababu Naidu about Pawan Kalyan:
“పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్లు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 21 సీట్లు గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. వై నాట్ 175 అని చెప్పారు కానీ 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న నాయకత్వం వాళ్ళది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం, ఎక్కడ గెలవాలో అక్కడ గెలవడం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్” అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు.













