లావణ్య బికినీ సీన్ తీసేశారట!

ఒకప్పడు హాలీవుడ్, బాలీవుడ్ కి మాత్రమే పరిమితమయిన బికినీ కలర్చర్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సర్వసాధారణం అయిపోయింది.సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ దగ్గరినుండి ప్రగ్యా జైస్వాల్ లాంటి అప్ కమింగ్ హీరోయిన్స్ వరకూ అంతా బికినీలతో కనువిందు చేస్తూ యూత్ కి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఇక ఈ మధ్య వచ్చిన రాజుగారి గది-2 ని ఫ్యామిలీ
ఆడియన్స్ తో పాటు మిగతా వాళ్ళకి కూడా చేరువ చెయ్యడానికి సీరత్ కపూర్ తో కూడా బికినీ వేయించి సినిమాకి బజ్ తెచ్చాడు ఓంకార్.
 
ఇలా బికినీ అనేది చాలా రొటీన్ ప్యాట్రన్ అయిపొయింది.అయితే లాస్ట్ మినిట్ లో రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో లై హీరోయిన్ మేఘ ఆకాష్ ని రీప్లేస్ చేసి ఛాన్స్ దక్కించుకున్న లావణ్య త్రిపాఠి కూడా బికినీ వేసిందట. ప్రస్తుతం లవణాయ కెరీర్ చాలా లో లో ఉండడడంతో ఈ నిర్ణయం తీసుకుందట. కానీ సినిమా మొత్తం చూసాక కంటెంట్ కి ఆ బికినీ సీన్స్ కి అస్సలు మ్యాచింగ్ కుదరకపోవడంతో వాటిని ఎడిట్ చేశారట. దాంతో డిసప్పాయింట్ అయిన లావణ్య ఈ సినిమా ప్రమోషన్స్ పై కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడంలేదని అంటున్నారు. నిజానికి మంచి పెర్ఫార్మర్ ఆయిన్ ఆమెకి ఛాన్సులు రావడంలేదని భలే భలే మగాడివోయ్ సినిమా నుండి కొంచెం గ్లామర్ డోస్ పెంచింది.
 
మొన్నీ మధ్యే యుద్ధం శరణం సినిమాలో సైతం అల్ట్రా మోడరన్ లుక్ లో కనిపించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో లావణ్యకి ఇప్పడు హిట్ ,హిట్ తో పాటు గుర్తింపు కూడా అవసరం. అందుకే అంతా ఫీల్ అవుతుంది.మొత్తానికి ఈ బినికి సీన్ కటింగ్ వల్ల లావణ్య తో పాటు ఆమె ఆ గెట్ అప్ లో ఎలా ఉంటుందా అని ఆశగా ఎదురుచూస్తున్న ఆమె ఫాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు.