సుకుమార్ కు చెర్రీ కండీషన్స్!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని చరణ్, సుకుమార్ కు ఓ కండీషన్ పెట్టాడట. దానికి కారణం చిరంజీవి అని తెలుస్తోంది. చిరు 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ నెలలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు.

కాబట్టి సినిమా సెట్స్ పైకి వచ్చే సమయానికి తను హీరోగా నటిస్తోన్న సినిమాను పూర్తి చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడు. అయితే సుకుమార్ సినిమా పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలల సమయమైనా పడుతుంది. మధ్యలో టెక్నికల్ సమయాలు ఏమైనా తలెత్తితే ఇంకాస్త ఆలస్యమవుతుంది. పైగా సుకుమార్ తన సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. మరి ఈ క్రమంలో సుకుమార్ తొందరగా సినిమాను పూర్తి చేయగలడో.. లేదో.. చూడాలి!