HomeTelugu Trendingనేను అక్కడుంటే.. ఆ కుర్రాడికి ఛార్మి ట్వీట్‌.. వైరల్‌

నేను అక్కడుంటే.. ఆ కుర్రాడికి ఛార్మి ట్వీట్‌.. వైరల్‌

4 28నటి ఛార్మికి డాన్సర్ గా మంచి గుర్తింపే ఉంది. ఎటువంటి భేషజం లేకుండా…. ట్యూన్స్ కు తగ్గట్టు డాన్స్ చేయడం ఈ హాట్ భామకు అలవాటే. ఆమె డ్యాన్స్ కు అభిమానులు చాలామందే వున్నారు. తన డ్యాన్స్‌తో ఓ కుర్రాడు ఛార్మి మనసు దోచేసుకున్నాడు. ఈ విషయాన్ని ఛార్మి ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా ఆ కుర్రాడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్‌ చేసింది ఈ భామ. ఇటీవల ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ అమ్మడు దూకుడు మామూలుగా లేదు. ఈ చిత్రంలోని ‘సిలక.. సిలక..’ అంటూ సాగే ఓ మాస్‌ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ పాటకు శ్రీకాంత్‌ అనే కుర్రాడు డ్యాన్స్‌ చేసిన వీడియోను అతని స్నేహితుడు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మిలను ట్యాగ్‌ చేశాడు. తాజాగా ఆ వీడియోను చూసిన ఛార్మి అతని డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. దీంతో శ్రీకాంత్‌ స్నేహితుడు పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ఆ కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది. ‘శ్రీకాంత్‌ చాలా అద్భుతంగా డ్యాన్స్‌ చేశావ్‌. నీలో ఎంతో ఎనర్జీ ఉంది. ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే నీతో కలిసి డ్యాన్స్‌ చేసేదాన్ని’ అని ఛార్మి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu