Homeపొలిటికల్ఛీ.. తారకరత్న విషమ పరిస్థితి పై విష ప్రచారమేనా ?

ఛీ.. తారకరత్న విషమ పరిస్థితి పై విష ప్రచారమేనా ?

Tarakaratna is in critical condition hospital confirms

నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమం అని ఒకవైపు వార్తలు వస్తుంటే.. నారా ఫ్యామిలీకి సేవ నంద‌మూరి వారికి క‌లిసి రావ‌డం లేదు అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. వెన్నుపోటు ఉదంతం దగ్గర నుంచి మొద‌లుపెడితే నారా చేతిలో నంద‌మూరి ఫ్యామిలీ ప‌రాభ‌వాల‌ను, అవ‌మానాల‌నూ పొందుతూనే ఉందని ఆ ప్రచారాల్లోని సారాంశం. నిజానికి తారక రత్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు, ఎప్పటి నుంచో తారకరత్నకు షుగర్ ఉంది, అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ వైఎస్ వివేకానంద రెడ్డికి ఏ సమస్య ఉందని గొడ్డలి వేటుతో అంతం చేశారు ?,

సీనియర్ ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు కాదు, మరి వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి కారణం ఎవరు ?, వైసీపీ పార్టీ ఎంపీ అని అందరికీ తెలిసిందే కదా. జగన్ రెడ్డికి అతని పార్టీ వారికీ కేవలం విమర్శలు చేయడమే తెలుసు. ఇష్టమొచ్చినట్టు కారుకూతలు కూయడమే తెలుసు. గ‌త కొన్నాళ్లుగా తార‌క‌ర‌త్న చంద్ర‌బాబు, లోకేష్ ల త‌ర‌ఫున తిరుగుతూ ఉన్నారు. ప‌చ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం కార్య‌క్ర‌మాలు ఎక్క‌డ ఉంటే అక్క‌డ‌కు వెళ్లి క‌నిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు జరగని సంఘటన లోకేశ్ పాదయాత్ర మొదటి రోజే ఎందుకు జరిగింది ?, దీని వెనుక ఏదో ఉంది అంటూ వైసీపీ సోషల్ మీడియా కోడి గుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది.

సొంత బాబాయ్ హత్య జరిగి సంవత్సరాలు జరుగుతున్నాయి. హత్య చేసిన వ్యక్తులు ఎవరో కూడా అర్ధమైపోయింది. అయినా, ఇంతవరకు కనీస యాక్షన్ లేదు. అసలు ఇలాంటి వ్యక్తులకు మాట్లాడే అర్హత ఉందా ?. దీనికితోడు ఎప్పుడో 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుపై ప్రేమాభిమానంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లాడు. విప‌రీత స్థాయిలో ప్ర‌చారం చేస్తూ.. ఒక రాత్రి యాక్సిడెంట్ కు గుర‌య్యారు తార‌క్. ఎన్నిక‌ల వేడిలో ఆ యాక్సిడెంట్ కు గురయ్యాడు ఎన్టీఆర్.

చంద్రబాబు కోసం అప్పుడు జూ.ఎన్టీఆర్, లోకేశ్ కోసం ఇప్పుడు తారకరత్న అంటూ కొత్త నినాదం అందుకున్నారు. నారా కుటుంబ సేవ కోసం అతిగా ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ప్పుడ‌ల్లా నంద‌మూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్య‌క్తులు కష్టాల పాలు అవుతున్నారంటూ ఓ వాదనను బయటకు తెస్తున్నారు. ఇది నిజమా ? కాదా ? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఏపీలోని ప్రస్తుత ప‌రిస్థితుల‌ కారణంగా ప్రజలంతా కష్టాల పాలు అవుతున్నారు. మరీ ఈ విషయం పై జగన్ రెడ్డి ఏం చెబుతాడు ?. ప్రస్తుతం తన బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు జగన్ రెడ్డి. కానీ, నేరం ఎప్పటికీ నేరమే. ఆ నేరం ఎవర్నీ వదిలిపెట్టదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu