చెల్లితో కలిసి నటించాలనుంది!

ఒకప్పుడు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అంటే తక్కువ ఎక్కువ అంటూ గొడవపడేవారు.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అందరూ ఒకరితో ఒకరు
స్నేహంగా ఉంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా.. ముగ్గురున్నా డైరెక్టర్ చెప్పిన మాట
విని తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. హీరోయిన్ కాజల్ కూడా తన తోటి
హీరోయిన్స్ అందరూ మంచి స్నేహితులని చెబుతోంది. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను..
ఇప్పటివరకు అందరితోనూ కలిసిమెలిసే ఉన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏ
హీరోయిన్ తో నటించడం మీరు ఇష్టపడతారని ప్రశ్నించగా.. ఎవరితో నటించడం అయినా..
నాకు పర్లేదు అయితే మా చెల్లి నిషాతో కలిసి నటించాలనే కోరిక మాత్రం ఎప్పటినుండో ఉంది.
తను నాకు మంచి స్నేహితురాలు. తనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా
అని చెప్పారు.