HomeTelugu Trendingచిరంజీవి భోళా శంకర్ నుంచి అప్డేట్

చిరంజీవి భోళా శంకర్ నుంచి అప్డేట్

Chiru Bhola Shanker update
మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్‌ను చిరంజీవి షేర్ చేశారు.

డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్స్ షేర్ చేస్తూ భోళాశంకర్ మూవీ డబ్బింగ్ పూర్తయింది. సినిమా రూపుదిద్దుకున్న తీరు చూసి చాలా ఆనందంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్‌లో డేట్స్‌ను గుర్తుంచుకోండి. ఆగస్టు 11న థియేటర్లలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

బోళా శంకర్ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu