
మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై చిరంజీవి ఇప్పటి వరకు స్పందిచలేదు. తాజాగా ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన చిరంజీవి.. ఈ వివాదం పై స్పందిచారు. గరికపాటి పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిరు కామెంట్ చేశారు. ఈ రెండు వాక్యాలతో గరికపాటితో నెలకొన్న వివాదానికి చిరు ముగింపు పలికినట్టైంది.
దసరా సందర్బంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్‌కి చిరు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరుతో అక్కడికి వచ్చిన వారు ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడగా… ఆ ఫొటో షూట్‌పై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు ఫొటో షూట్ ఆపేసి వస్తే తాను ప్రసంగిస్తానని, లేదంటే తాను అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి వ్యాఖ్యలతో వేదిక ఎక్కిన చిరు గరికపాటి పక్కనే కూర్చున్నారు.











