సుందర్ కు హీరోలు దొరికారు!

తమిళ దర్శకుడు సుందర్.సి ‘సంథింగ్ సంథింగ్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఓ సినిమా రూపొందించడానికి ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంఘమిత్ర అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. అయితే మొదట ఈ సినిమా కోసం మహేష్ బాబు, విజయ్ వంటి స్టార్ హీరోలను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ వారి బిజీ షెడ్యూల్స్ వలన కుదరలేదు. దీంతో ఆర్య, జయం రవిలను హీరోలుగా ఫైనల్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ తో పాటు.. బాలీవుడ్ నుండి కూడా స్టార్స్ ను రంగంలోకి దింపడానికి సిద్ధమవుతున్నారు. టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు.
CLICK HERE!! For the aha Latest Updates