నాగబాబు స్పీచ్ పై యండమూరి రియాక్షన్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ శనివారం గుంటూరులో జరిగింది. ఈ ఫంక్షన్ చిరంజీవి తమ్ముడు నాగబాబు అటు రామ్ గోపాల్ వర్మ పై, మరోవైపు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ పై నిప్పులు చెరిగారు. దీనిపై రామ్ గోపాల్
వర్మ ట్విట్టర్ లో తన ట్వీట్స్ తో నాగబాబుపై కౌంటర్స్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా యండమూరి వీరేంధ్రనాథ్, నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు.

‘ఇటీవలే మేమిద్దరు ఓ ఫంక్షన్ లో కలిశాం. గురువుగారు అంటూ పలకరించి ఖచ్చితంగా మీరు మాకోసం కథ రాయాలని చెప్పారు. మరి ఇప్పుడు ఆయన ఇలా నాపై ఫైర్ అవ్వడం ఏంటో అర్ధం కావడం లేదు. బహుశా అంతమంది జనాలను చూసి ఆవేశంతో మాట్లాడి ఉంటాడు’ అంటూ వెల్లడించారు.. కానీ నాగబాబు ఇలా పబ్లిక్ ఫంక్షన్ లో యండమూరిని మూర్ఖుడు, వ్యక్తిత్వ వికాసం లేని వాడు, అతడు కాస్త వ్యక్తిత్వం నేర్చుకోవాలని చెప్పడం వెనుక బలమైన కారణం ఉన్నప్పటికీ కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.