ఉయ్యాలవాడ సినిమాపై చిరు మాటలు!

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం గురించి చిరు తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇది మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడి కథ.. యుద్ధ వ్యూహాలు, వెన్నుపోట్లు, త్రికోణ ప్రేమ కథ.. ఇలా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. చాలా ఏళ్ల క్రితం హాలీవుడ్ లో వచ్చిన ‘బ్రేవ్ హార్ట్’ సినిమా స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నట్లు చిరు చెప్పాడట.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో చేయాల్సిందని.. బడ్జెట్ పరంగా భారీ ఖర్చు ఉంటుందని.. ఇప్పుడు ఉన్న మార్కెట్ దృష్ట్యా అంత పెట్టుబడి పెట్టినా.. తిరిగి వస్తుందనే నమ్మకంతో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం ఉన్నాడట. ఏప్రిల్ నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.