
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుంచి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరగనుంది. ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అవ్వడంతో అభిమానులంతా కాస్త ఆందోళన చెందారు. ఆతర్వాత కొద్దిరోజులకే నెగిటివ్ రావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా సినిమాలు చేయనున్నారు. అందులో మెహర్ రమేష్ తో ఒక సినిమా వీవీ వినాయక్, అలేగే బాబీ దర్శకత్వంలో సినిమా లు చేయనున్నాడు. వీటిలో ముందుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళమ్’ సినిమాను రీమేక్ చేయనున్నాడు చిరంజీవి.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా పలువురు స్టార్ హీరోయిన్‌లను పరిశీలిస్తున్నారు. కాగా ముందు సాయిపల్లవి పేరు వినిపించగా.. ఆతర్వాత కీర్తిసురేష్ ఆ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా పై మరో వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకోసం మెగాస్టార్ భారీగా రెమన్యురేషన్ తీసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దాదాపు 60 కోట్లు ఈ సినిమాకోసం చిరంజీవికి ముట్టజెప్పనున్నారని ప్రచారం జరుగుతుంది. దినిలో ఎంత నిజముందో తెలియదు. ఇక ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది ఈసినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభమైయ్యా అవకాశాలు ఉన్నాయి.













