
Kannappa Release Date:
మంచు విష్ణు భారీ రిస్క్ తీసుకున్నాడు. ‘కన్నప్ప’ సినిమాతో అతను తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రయత్నం చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా స్క్రిప్ట్ మీద రీసెర్చ్ చేశారు. తండ్రి మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాకి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. కానీ మంచు విష్ణుకు గత సినిమాల ట్రాక్ రికార్డ్ బలహీనంగా ఉండడంతో, థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు ఏ డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా రేట్లు ఆఫర్ చేయలేదు. కానీ విష్ణు మాత్రం ఈ సినిమా హక్కులన్నీ అమ్మకుండా పూర్తిగా రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర సినిమాకే హైలైట్ అనే టాక్. రెండో అర్ధభాగంలో ఆయన ఎంట్రీ వస్తుంది. మొత్తం 35 నిమిషాల పాటు ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన స్థాయి, పాన్ ఇండియా క్రేజ్ సినిమాకి ఓపెనింగ్స్ తేనని విష్ణు నమ్ముతున్నాడు.
ఇంత కీలక పాత్ర చేసినా కూడా ప్రభాస్ ప్రమోషన్లకు రావడం లేదు. మోహన్ బాబుకి మంచి సంబంధం ఉన్నప్పటికీ, ప్రమోషన్లలో ఉండటం సినిమాకి మరో బలంగా మారేది. అయినా కూడా, విష్ణు తీసుకున్న ధైర్యం నిజంగా మెచ్చుకోదగ్గది.
ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డీల్స్‌పై కాంప్రమైజ్ అవుతూ, బిజినెస్ సెటిల్ చేసుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్న రోజుల్లో, విష్ణు మాత్రం ఆ స్టెప్ తీసుకోకుండా పూర్తిగా రిస్క్‌పై వెళ్తున్నాడు.
ఈ శుక్రవారం ‘కన్నప్ప’ రిలీజ్ అవుతోంది. మంచి టాక్ వస్తే, విష్ణు తన హార్డ్‌వర్క్‌తో మంచి విజయాన్ని అందుకోవచ్చు. ఇక మిగతాదంతా ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడింది.
ALSO READ: ఈసారి Bigg Boss 19 లో షాకింగ్ ట్విస్టులు! సీక్రెట్ రూమ్ మళ్లీ వచ్చేస్తోంది!