HomeTelugu Big Stories'లాల్ సింగ్ చడ్డా' ప్రేయసిని పరిచయం చేసిన చిరంజీవి

‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసిని పరిచయం చేసిన చిరంజీవి

Chiranjeevi introduces Lal

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ న‌టిస్తోన్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అద్వైత్ చంద‌న్ డైరెక్ష‌న్‌లో వస్తున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్, వ‌యాకామ్ 18 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు. హీరోయిన్ క‌రీనాక‌పూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ అప్‌డేట్‌ను చిరంజీవి ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

లాల్ సింగ్ చడ్డా ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నా.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇప్ప‌టికే చిరంజీవి కోసం హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంట్లో అమీర్‌ఖాన్ స్పెష‌ల్ షో వేసిన విష‌యం తెలిసిందే. చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ షోకు అమీర్‌తోపాటు నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, సుకుమార్‌, రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు. ఈ చిత్రం ఆగ‌స్టు 11న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. హాలీవుడ్ కామెడీ డ్రామా ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా వ‌స్తుంది లాల్ సింగ్ చ‌ద్ధా. ఈ ప్రాజెక్టుతో నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!