పవన్ ‘అజ్ఞాతవాసి’!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా టైటిల్ ‘అజ్ఞాతవాసి’ అని ఆ వార్తల సారాంశం. ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ధీర్ఘాలోచన చేస్తూ.. శూన్యంలోకి నడుస్తున్నటుగా కనిపిస్తున్నాడు పవన్. ఏదొక విషయమై ఆయనలో
అంతర్మధనం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఈ క్రమంలో సినిమాకు టైటిల్ గా ‘అజ్ఞాతవాసి’ అనే పేరు హల్ చల్ చేస్తోంది. పవన్ ఫ్యాన్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానమా..? లేక నిజంగానే ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. పవన్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఈ టైటిల్ అంతగా సెట్ కాలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.