చియాన్ తో తొలిసారిగా!

దక్షిణాది టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు.. దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఈ భామ జత కట్టింది. కానీ ఇప్పటివరకు తమిళ స్టార్ హీరో విక్రమ్ తో మాత్రం కలిసి పనిచేసే ఛాన్స్ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని
తెలుస్తోంది. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో హీరోగా విక్రమ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ బాషల్లో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సినిమా నిర్మాణం ఆలస్యం కానుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ ను వదులుకుంది. దీంతో ఇప్పుడు ఆ ఛాన్స్ తమన్నాకు వెళ్లింది. తమ్మూ బ్యూటీ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపిస్తోందని సమాచారం. డేట్స్ కూడా అడ్జస్ట్ చేయడానికి రెడీ అయిందట. ఇక త్వరలోనే ఈ జంటను తెరపై చూసేయొచ్చు!