చిరు, బాలయ్యలు ఓకేరోజు రానున్నారా..?

బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను
భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్
కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల
కానున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి శాతకర్ణి సినిమాను జనవరి 12న విడుదల
చేయాలనుకున్నారు. అయితే సెలవుల సమయం కావడంతో రెండు రోజులు ముందుగానే సినిమాను
రిలీజ్ చేస్తే బావుంటుందనే ఆలోచనలో ఉన్నారు. బయ్యర్లు కూడా ఈ విషయంపై నిర్మాతలపై
ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాబట్టి సినిమా రెండు రోజులు ముందుగానే విడుదలయ్యే అవకాశాలు
కనిపిస్తున్నాయి. అలానే ఖైదీ నెంబర్ 150 సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు.
ఇప్పుడు ఆ డేట్ ను కాస్త ప్రీపోన్ చేసి జనవరి 11న రావాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ రెండు
సినిమాలు ఒకేరోజు విడుదలయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.