‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’ ప్రేయసితో చిందులేసిన సాయి ధరమ్‌ తేజ్

యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమాకి కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేశారు. ‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’ అంటూ ప్రేయసితో తెగ చిందులేస్తున్నారు. ధరమ్‌ తేజ్‌, కల్యాణిపై ఈ పాటను చిత్రించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates