దిల్ రాజు రిస్క్ పాతిక కోట్లు!

ఈ దసరాకు రాబోయే మూడు సినిమాల నైజాం హక్కులు కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. మిగిలిన పంపిణీదారులు ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పుతామని చెప్పినప్పటికీ దర్శకనిర్మాతలు థియేటర్ల విషయంలో సమస్య వస్తుందని దిల్ రాజు చేతిల్లోనే తమ సినిమాలను పెట్టారు. ముందుగా ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జై లవకుశ’ సినిమాపై దిల్ రాజు పెట్టిన మొత్తం పెట్టుబడి పాతిక కోట్లు. ఈ సినిమా నైజాం హక్కులను, వైజాగ్ ఏరియా హక్కులను దిల్ రాజు ఎన్ఆర్ఏ పద్ధతి ద్వారా తీసుకున్నాడు. నైజాం హక్కులను ఇరవై కోట్లకు తీసుకోగా.. అందులో దిల్ రాజు రిస్క్ 18 కోట్లు. 
అంటే సినిమా 20 కోట్లు కలెక్ట్ చేయలేకపోతే.. ఆ రెండు కోట్ల నష్టాన్ని చిత్రనిర్మాత దిల్ రాజుకి తిరిగి ఇస్తాడు. అలానే వైజాగ్ ఏరియా హక్కులను ఎనిమిది కోట్లకు తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆయన రిస్క్ 7 కోట్లు. రెండు ఏరియాల్లో దిల్ రాజు తీసుకుంటున్న రిస్క్ 25 కోట్లన్నమాట. మరి ఆ స్థాయిలో బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతుందేమో.. చూడాలి!