క్రిస్మస్ కు పోటీగా దిగుతున్నారు!

ఇప్పటికే దసరా కానుకగా రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ పెరిగిపోయింది. దీంతో కొన్ని చిత్ర్హాలు
దసరాను పక్కన పెట్టి క్రిస్మస్ కు రావడానికి ముస్తాబవుతున్నాయి. నిజానికి చరణ్ తన ‘దృవ’
సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రాన్ని డిసంబర్
17కు వాయిదా వేశారు. ఎత్తిపరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిసంబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
అలానే నాని-కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న ‘నేను లోకల్’ సినిమాను కూడా డిసంబర్ లో క్రిస్మస్
కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాని సైతం వెల్లడించారు.
ఇక వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ‘గురు’ చిత్రాన్ని కూడా డిసంబర్ లోనే రిలీజ్ చేయనున్నారు.
రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసి డిసంబర్ 19న విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇక ఈ లిస్ట్ లోకి ఇంకెన్ని సినిమాలు వచ్చి చేరతాయో చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates