బాహుబలి2 ప్రీరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్!

అంగరంగ వైభవంగా జరిగిన బాహుబలి 2 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. బాలీవుడ్ నుండి కూడా అతిథులు విచ్చేశారు. ఈ స్టేజ్ పై సినిమా కోసం పని చేసిన ఒక్కో టెక్నీషియన్, ఆర్టిస్ట్ కోసం చేసిన వీడియోలు హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా రాజమౌళి కోసం వేసిన వీడియో అందరినీ మెప్పిచింది. కీరవాణితో కలిసి స్టేజ్ మీదకు వెళ్లిన రాజమౌళి ఆ వీడియో చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. తండ్రి అలా కంటతడి పెట్టడం చూసి తట్టుకోలేని రాజమౌళి కూతురు వెంటనే వెళ్లి తండ్రిని హత్తుకోవడం అక్కడ ఉన్న వేలాది మందితో పాటు టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులను సైతం ఎమోషన్ కు గురి చేసింది.

ఇక ప్రభాస్ కోసం ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తోన్న అభిమానుల కోసం ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని అనౌన్స్ చేశారు. రానా ఎంతమందితో కలిసి నటించినా.. నా ఫెవరెట్ కో స్టార్ ప్రభాసే అని చెప్పారు. ఇక అన్నిటికంటే ఫంక్షన్ లో హైలైట్ గా నిలిచింది కరణ్ జోహార్ స్పీచ్. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రం బాహుబలి అని కొనియాడారు. అంతేనా.. రాజమౌళి గ్లోబర్ ఫిలిం మేకర్ అని.. స్పీల్ బర్గ్, జేమ్స్ కెమరూన్ వంటి దర్శకుల జాబితాలో నిలబడగలిగే సత్తా ఉన్న దర్శకుడని అన్నారు.