అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. హనుమకొండలో ఆఖరి షెడ్యూల్ పూర్తైన వెంటనే చిత్రబృందం ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. కొండా దంపతులు పాల్గొన్న ఈ పార్టీలో రామ్‌గోపాల్ వర్మ తాజాగా నక్సలైట్ అవతారం ఎత్తి హాల్‌చల్ చేశారు. తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విటర్ వేదికగా ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021