జైలవకుశ నుండి సినిమాటోగ్రాఫర్ ఔట్!

ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘జైలవకుశ’ సినిమాకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ ను రంగంలోకి దింపారు. అయితే ఇప్పుడు సడెన్ గా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీకు మురళీధరన్ కు మధ్య ఏర్పడిన విబేధాల కారణంగానే ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా టాక్. అయితే చిత్రబృందం మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. మురళీధరన్ సినిమా నుండి వెళ్లిపోతున్న మాట నిజమే గానీ దానికి వేరే కారణాలు ఉన్నాయని వాధిస్తున్నారు.

కారణాలు ఏవైతేనేం.. ఇప్పుడు మురళీధరన్ స్థానంలోకి ఛోటా కె నాయుడు వచ్చి చేరాడు. తెలుగులో ఛోటాకు ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్న మూడు పాత్రల లుక్స్ ను కలగలిపేలా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.