HomeTelugu Big Storiesనువ్వు ఏమైనా పతివ్రతవా? : వనిత

నువ్వు ఏమైనా పతివ్రతవా? : వనిత

Clash between lakshmi ramak

సీనియర్‌ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రచ్చ మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్, టీవీ ఛానెల్స్‌లో మాటల యుద్ధం కొనసాగుతున్నది. లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ తదితర సెలబ్రిటీలు వనితా విజయ్ కుమార్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే.. వనిత ఘాటుగా స్పందించింది. ఇటీవల ఓ టీవీషోలో లైవ్ లో వనితా విజయ్ కుమార్ రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. తాజాగా లక్ష్మీ రామకృష్ణన్ మరియు వనితలు ఒక లైవ్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరి మధ్య చర్చ వేడివేడిగా సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా మాటలయుద్ధం జరిగింది. ఒకానొక టైమ్‌లో లక్ష్మీ రామకృష్ణన్‌ను మాట్లాడకుండా వనిత రెచ్చి పోయింది. నేను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటీ అంటూ ప్రశ్నించింది. గతంలో తాను ఏవో కారణాల వల్ల విడాకులు ఇచ్చాను. నన్ను తప్పు అనడానికి నువ్వు ఏమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా అంటూ మండి పడింది. ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించింది. నా భర్తలతో కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఉన్నాను. నీ మాదిరిగా భర్తను మోసం చేయలేదంటూ లక్ష్మీ రామకృష్ణన్‌పై నిప్పులు చెరిగింది. నీవు ఉన్న ఇండస్ట్రీలోనే నేను ఉన్నాను. నీ బండారం అంతా నాకు తెలుసు. మొత్తం బయట పెడతా అంటూ హెచ్చరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!