సినిమా హిట్ కానీ ఛాన్సులే లేవు!

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్ అయింది. సినిమా వసూళ్ల పరంగా సూపర్ హిట్ అనిపించుకున్నా.. దర్శకుడిగా హరీష్ కు మాత్రం పెద్ద పేరు తీసుకురాలేకపోయింది.  ఇప్పటివరకు మరో సినిమా అవకాశం కూడా రాలేదు. గబ్బర్ సింగ్ తర్వాత రామయ్యా వస్తావయ్య, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాధం ఈ మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్లోనే చేశాడు.
మరో నిర్మాతను హరీష్ తన కథలతో మెప్పించలేకపోయాడు. రొటీన్ ఫార్ములాతో తీసిన డిజె సినిమా ఆయనను ఎలాగో బయటపడేసింది కానీ ఈసారి మాత్రం రొటీన్ కథతో వస్తే నెగెటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఓ రొమాంటిక్ సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్న హరీష్ త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నాడు. మరి ఈ కథలో నటించే హీరో ఎవరో తెలియాల్సివుంది!