కాజల్ సినిమా “సీత” టైటిల్‌పై వివాదం

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన సీత సినిమా టైటిల్‌పై భారతీయ జన యువ మోర్చా (BJYM) అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాకు సీత టైటిల్ పెట్టడంపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌తో పలు అభ్యంతరకర డైలాగులు చెప్పించడంపై వాళ్లు మండిపడుతున్నారు. సీత అనే పవిత్రమైన పేరు పెట్టి ఈ క్యారెక్టర్‌తో డైరెక్టర్ బూతులు చెప్పించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ టైటిల్ పెట్టి దర్శకుడు హిందువుల సెంటిమెంట్‌తో ఆటలు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద హిందువుల ఆరాధ్య దేవతయైన సీత పేరుతో ఎలా పడితే అలా సినిమా తీస్తే ఊరుకునేది లేదన్నారు. వెంటనే డైరెక్టర్ ఈ సినిమా సీత టైటిల్‌తో పాటు.. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌తో చెప్పించిన బూతు డైలాగులను తొలగించాలని, హిందువుల మనోభావాలను కించపరిచినందుకు ఈ సినిమా దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఫిల్మ్ చాంబర్‌లో ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక మెమోరాండం సమర్పించారు. ఒకవేళ మేం చెప్పిన డిమాండ్లు ఒప్పుకోకపోతే..ఐపీసీ సెక్షన్ 295(1),502 (2) కింద దర్శక, నిర్మాతలపై కేసు నమోదు చేస్తామన్నారు.

View this post on Instagram

❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on