HomeTelugu Newsభారత్‌లో 249 మంది కరోనా బాధితులు

భారత్‌లో 249 మంది కరోనా బాధితులు

15 5
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గంట గంటకూ బాధితులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 249 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 29 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తెలిపింది. కరోనా బాధితుల్లో 191 మంది భారతీయులు కాగా 32 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదుకావడంతో ముంబై సహా ప్రధాన నగరాలను మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేరళ, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో కరోనా బాధిత కేసులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణా కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వెయ్యి మంది కరోనా అనుమానితులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ సర్కారు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu