HomeTelugu Newsభారత్‌లో ఒక్కరోజు 3390 మందికి కరోనా, 130 మంది మృతి

భారత్‌లో ఒక్కరోజు 3390 మందికి కరోనా, 130 మంది మృతి

6 7
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తం 3,390 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం మొత్తం ఇప్పటి వరకు 56,342 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి దేశంలో 1886 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,540 మంది దీనిబారినుంచి కోలుకుని బయటపడ్డారు. మరో 37,916 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

ఒక్కరోజులోనే భారత్‌లో కరోనాతో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు కావడం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరోవైపు గుజరాత్‌లోనూ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి కఠిన చర్యలుచేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వస్థలాలకు రప్పిస్తున్నందున రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 694 మంది, గుజరాత్‌లో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబై నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 11 వేలు దాటింది. మహారాష్ట్ర వ్యాప్తంగా 17,974 మంది కరోనా బాధితులు ఉన్నారు. గుజరాత్‌ 7,013, ఢిల్లీ 5,980, తమిళనాడు 5,409, రాజస్థాన్ 3,453, మధ్యప్రదేశ్ 3,252, యూపీ 3,071, ఏపీ 1,887, పంజాబ్ 1,644, బెంగాల్, 1,548, తెలంగాణలో 1,122 మంది కరోనా బాధితులు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu