HomeTelugu Big Storiesరివ్యూ: సింగం 3

రివ్యూ: సింగం 3

నటీనటులు: సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధికా శరత్ కుమార్, క్రిష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రియన్
సంగీతం: హారీస్ జయరాజ్
ఎడిటింగ్: విజయన్, జయ్
నిర్మాత: మల్కాపురం శివకుమార్
దర్శకుడు: హరి
వరుస వాయిదాల అనంతరం సూర్య నటించిన సింగం 3 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా గత చిత్రాల మాదిరి విజయాన్ని అందుకుందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కర్నాటకలోని మంగుళూరు ప్రాంతానికి ఓ కేసు విషయమై ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసింహం(సూర్య) అనే పోలీస్ ను పిలిపిస్తారు. మంగుళూరు కమీషనర్ ను చంపింది ఎవరో తెలుసుకోమని నరసింహానికి బాధ్యతలు అప్పగిస్తారు. తక్కువ సమయంలోనే నరసింహం, కమీషనర్ ను హత్య చేసింది మధుసూదన్ రెడ్డి(శరత్ సక్సేనా) అని తెలుసుకుంటాడు. అయితే కమీషనర్ హత్య చేసింది మధుసూదన్ అయినా.. హత్య చేయించింది మాత్రం విఠల్(అనూప్ సింగ్) అని నరసింహంకు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన విఠల్ తన తండ్రి సెంట్రల్ మినిస్టర్ కావడంతో ఆ అండ చూసుకొని ఇండియాలో కొన్ని అక్రమాలు చేస్తున్నాడని తెలుసుకున్న నరసింహం ఆ విషయాన్ని తనే డీల్ చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి నరసింహం అనుకున్న పనిని పూర్తి చేస్తాడా..? విఠల్ చేసే అక్రమ పనులు ఏంటి..? కమీషనర్ ను చంపడానికి గల కారణాలు ఏంటి..? అనుష్క, శృతిహాసన్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
సింగం సిరీస్ లో వచ్చిన మొదటి రెండు భాగాల్లానే ఈసారి కూడా దర్శకుడు హరి ఎమోషన్, యాక్షన్ డ్రామానే కథగా ఎన్నుకున్నాడు. అయితే ఈసారి యాక్షన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. అయితే కొన్ని చోట్ల యాక్షన్ ఎక్కువైందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి కథలకు కామెడీ జోడించాలనే ప్రయత్నం చేయకూడదు. గత రెండు చిత్రాల్లో సిట్యుయేషన్స్ ను బట్టి కామెడీ పండించారు. ఈ సినిమాలో కూడా అలానే చేయాలనుకున్నారు. అది కాస్త ఫ్లాప్ అయింది. కామెడీ ఈ సినిమాకు పెద్ద మైనస్.

పోలీస్ ఆఫీసర్ గా గంభీరమైన పాత్రలో సూర్య జీవించేశాడు. ప్రతి ఎమోషన్ ను అధ్బుతంగా పండించాడు. తెరపై ఆయన తప్ప మరో మరొకరిపై దృష్టి వెళ్లకుండా మొత్తం తానే కనిపించాడు. అంతగా ఆకట్టుకున్నాడు సూర్య. అనుష్క పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. పైగా సినిమాలో ఆమె చాలా లావుగా కనిపించి గ్లామర్ గా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక శృతిహాసన్ రోల్ ఎవరో ఒక హీరోయిన్ కథకు గ్లామర్ యాడ్ చేయాలి అది శృతిహాసన్ అయితే బావుంటుందని ఆమెను తీసుకున్నారు. అంతే తప్ప ఆమె పాత్ర కూడా అంత గొప్పగా లేదు. అనూప్ సింగ్ విలన్ పాత్రలో బాగా నటించాడు. తన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది. పొగరుగా, బలంగా ఉంటూ హీరో పాత్రకు పోటీ ఇచ్చింది విలన్ క్యారెక్టర్.

సాంకేతికంగా సినిమాను భారీ లెవెల్లో నిర్మించారు. ప్రొడక్షన్ విలువలు రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఛేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా చూపించారు. పాటలు వినడానికి కష్టంగా ఉన్నా.. విజువల్ గా మాత్రం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను కాకుండా కొత్తదనం కోసం హరీశ్ జయరాజ్ ను ఎన్నుకున్నారు. కానీ ఆయన స్టాండర్డ్స్ సినిమాకు హెల్ప్ కాలేకపోయాయి. ఏ పాట అంత గొప్పగా లేదు. నేపధ్య సంగీతం కూడా ఏవరేజ్ గా ఉంది. ఎడిటింగ్ వర్క్ సో.. సో.. గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదటి ఇరవై నిమిషాలు విసుగు పుట్టిస్తాయి. ఎప్పుడైతే కథ మొదలవుతుందో.. హరి తన కథనంతో పరుగులు పెట్టించాడు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 2.75/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu