ధనుష్ మా అబ్బాయే అంటున్న దంపతులు!

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మా కొడుకే అంటూ మధురై కు చెందిన ఓ దంపతులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు దానిని  విచారణకు కూడా స్వీకరించింది. అసలు విషయంలోకి వస్తే.. మధురై జిల్లాలో మేలూర్ ప్రాంతానికి చెందిన కదిరేశన్, మీనాల్ దంపతులు ధనుష్  తమ కుమారుడని, అతడి అసలు పేరు కలై సెల్వన్ అని చెబుతున్నారు. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోవడం లేదని మందలించడంతో ఆగ్రహంతో  తమను విడిచి వెళ్లిపోయాడని పిటీషన్ లో పేర్కొన్నారు. తను ఇంట్లో నుండి వెళ్లిపోతూ.. ఓ లేఖ కూడా రాసిపెట్టి వెళ్లాడని అంటున్నారు.

అందులో తను సినిమాల్లో చేరేందుకు వెళ్తున్నానని.. తన గురించి వెతకొద్దని రాసినట్లు చెప్పారు. ధనుష్ మా కుమారుడే అని  నిరూపించుకోవడానికి వైధ్య పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్ట్ జనవరి 12వ తేదీన  న్యాయస్థానానికి హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ధనుష్ ను ఇలానే ఓ వ్యక్తి తన కుమారుడేనంటూ.. తనకు అప్పగించాలని హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే!