HomeTelugu News'మహర్షి' షూటింగ్‌ వాయిదా..!

‘మహర్షి’ షూటింగ్‌ వాయిదా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డెహ్రాడూన్ లో రెండు షెడ్యూల్స్ ముగించిన టీమ్ గత వారమే 25 రోజుల షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రయాణం కాస్త రద్దైనట్టు తెలుస్తోంది.

7 15

ఈ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ బాబు న్యూలుక్‌తో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu